అనంతపురం నగరంలో తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామని బుధవారం నగర మేయర్ మహమ్మద్ వసీం సలీం పేర్కొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. మారుతీ నగర్ లో డెంగ్యూ కేసు నమోదు కావడంతో అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.