యలమంచిలిలో బుధవారం భారీ వర్షం బీభత్సం సృష్టించింది. రాంనగర్ నాగేంద్ర కాలనీ, యాదాద్రి కాలనీలో, ఒరిగంటివారి వీది సీతారామరాజు కాలనీలో చెట్లు విరిగిపడ్డాయి. దాంతో చాలా చోట్ల కరెంటు స్తంభాలు నెలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ కుమార్ వెంటనే పరిస్థితిని చక్కదిద్దాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. మున్సిపల్ ఛైర్పర్సన్ పిల్లా రమాకుమారి దగ్గరా ఉండి పరిస్తితి చక్కబడేలా పడిపోయే, రోడ్ కి అడ్డంగా ఉన్న చెట్లు సిబ్బందితో తొలగించారు.