ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై విశాఖలో రవాణాశాఖ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. విశాఖ డిటిఒ ఆదేశాల మేరకు అగనంపూడి టోల్గేట్ వద్ద రెండురోజులుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆర్టిఎ అధికారులు తనిఖీలు చేశారు. శుక్రవారం తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేశారు.