విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి రవాణా అరికట్టే చర్యలు భాగంగా శుక్రవారం పోలీసులు డాగ్ స్క్వాడ్స్తో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఆదేశాల మేరకు ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, ఎంవీపీ కాలనీ గోపాలపట్నం తదితర ప్రాంతాల్లో ప్రయాణికుల లగేజ్ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలియజేశారు