విశాఖ జిల్లాలో పలు పాఠశాలలు, కళాశాలలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలు, ట్రాఫిక్ నిబంధనలు మొదలైన అంశాలపై విద్యార్థులకు పోలీసులు అవగాహన కల్పించారు. మంగళవారం విశాఖలోని గాజువాక, విశాఖ తూర్పు, దక్షిణ, భీమిలి ప్రాంతాల్లోని విద్యాసంస్థల్లో ఈ కార్యక్రమాలను నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాలమేరకు నిర్వహించినట్టు పోలీసులు వెల్లడించారు.