గన్నవరం విమానాశ్రయంలో నటి హన్సిక సందడి చేశారు. అనంతరం, విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన విజయవాడ నోవాటల్ హోటల్‌కి బయలుదేరి వెళ్లారు. ఈ ముద్దుగుమ్మ ఓ ప్రైవేట్ కార్యక్రమం నిమిత్తం విజయవాడ వచ్చారని సమాచారం. సోదరుడి భార్య ఫిర్యాదుతో హన్సికతో సహా ఆమె తల్లిపై గతంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇటీవలే తనపై నమోదైన గృహ హింస కేసును కొట్టివేయాలంటూ నటి హన్సిక బాంబే హైకోర్టును ఆశ్రయించారు.