షావోమీ కొత్తగా తీసుకొచ్చిన రెడ్‌మీ 14సీ 5జీ ఫోన్‌ను షావోమీ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ (మార్కెటింగ్) సందీప్ శర్మ తెలుగు రాష్ట్రాల మార్కెట్‌లోకి విడుదల చేశారు. 4జీబీ+64జీబీ ఫోన్‌ను రూ.9,999కి అందిస్తున్నట్లు వివరించారు. 6జీబీ+128జీబీ ఫోన్ ధర రూ.11,999. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా షావోమీ హైపర్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌కు 50ఎంపీ-8ఎంపీ కెమెరాలున్నాయి.