రాయడం... చదవడం వస్తే చాలు నివాసం ఉంటున్న గ్రామంలోనే నీటిపారుదలశాఖకు చెందిన కొలువు చేతికి రానుంది. ప్రధాన కాలువలు, డ్యామ్‌లు/రిజర్వాయర్ల పర్యవేక్షణ నిమిత్తం లష్కర్‌లను, హెల్పర్లను నియమించుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 1597 మంది లష్కర్‌లు, గేట్ల ఆపరేషన్ కోసం 281 మంది హెల్పర్లను ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన నియమించుకోనున్నారు. విద్యార్హతతో సంబంధం లేకుండా, 45 ఏళ్లలోపు వయసు కలిగి... శారీరకదారుడ్యం ఉన్నవారు అర్హులు. ఎంపికైన వారికి ప్రతీనెల రూ.15,600లు అందనుంది.