అడవి పంది కారణంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య గన్‌మెన్ శ్రీనివాస్ మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా BDL భానూరు పీఎస్ పరిధిలోని వెలిమల తండా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అడవి పంది అడ్డు రావడంతో తప్పించే క్రమంలో బైక్ అదుపుతప్పి శ్రీనివాస్ పడిపోయాడు. ఈ క్రమంలో తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.