ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఇదేం ఇందిరమ్మ రాజ్యం?: హరీశ్ రావు

78பார்த்தது
ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఇదేం ఇందిరమ్మ రాజ్యం?: హరీశ్ రావు
BRS నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్‌పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని పార్టీ నేత హరీశ్ రావు హెచ్చరించారు. HCU విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసినందుకు విద్యార్థులు, పార్టీ నాయకులు, సోషల్ మీడియా వారియర్స్‌పై అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. 'మీ పిట్ట బెదిరింపులకు భయపడేది లేదు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఇదేం ఇందిరమ్మ రాజ్యం? అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి' అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி