2026 జనాభా లెక్కలు పూర్తి అయ్యాక రిజర్వేషన్లు ఇస్తామని CM రేవంత్ ప్రకటించారు. రిజర్వేషన్లు పెంచాలంటే సహేతుకమైన విధానం ఉండాలని చెప్పారు. జనాభా లెక్కలు తేలిన తర్వాత రిజర్వేషన్లు పెంచుతామన్నారు. 'ఎస్టీల్లో 59 ఉపకులాలు ఉన్నాయి. వీటిని 3 గ్రూపులుగా విభజించాం. మొదటి గ్రూపులో 15 ఉపకులాలున్నాయి.. వారికి 1% రిజర్వేషన్. రెండో గ్రూపులో 18 ఉపకులాలు.. వారికి 9% రిజర్వేషన్. మూడో గ్రూపులో 26 ఉపకులాలు.. వారికి 5% రిజర్వేషన్' అని పేర్కొన్నారు.