గతంలో యాదగిరిగుట్టలో భక్తులకు సరైన వసతులు లేవని మంత్రి కొండా సురేఖ అన్నారు. తమ ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి యాదగిరిగుట్టలో వసతుల కల్పించిందని చెప్పారు. వసతులు ఇంకా మెరుగుపరిచేందుకు యాదగిరిగుట్ట పాలకమండలి ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఏడాదికి రూ.100 కోట్ల ఆదాయం వచ్చే ఆలయాలన్నీ దేవదాయశాఖలోకి వస్తాయని చెప్పారు. యాదగిరిగుట్ట బోర్డులో మొత్తం 18 మంది సభ్యులు ఉంటారని.. యాదగిరిగుట్టకు IAS స్థాయి అధికారి ఈవోగా ఉంటారని చెప్పారు.