ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ పోటీలకు శ్రీచేతన్

73பார்த்தது
ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ పోటీలకు శ్రీచేతన్
కలకత్తా నగరంలో జరిగే ఆల్ ఇండియా సబ్ జూనియర్స్ అండర్ - 13 బ్యాడ్మింటన్ 1 ర్యాంకింగ్ పోటీలకు వరంగల్ బల్దియా ఇండోర్ స్టేడియం క్రీడాకారుడు శ్రీచేతన్ శౌర్య ఎంపికయ్యాడు. ఈ నెల 14 నుంచి 19 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటాడని బ్యాడ్మింటన్ కోచ్ మాడిశెట్టి శ్రీధర్ శుక్రవారం తెలిపారు. ఇటీవల దేశవ్యాప్తంగా పలుచోట్ల జరిగిన ర్యాంకింగ్ టోర్నమెంట్లలో ప్రత్యేక ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు.

தொடர்புடைய செய்தி