హనుమకొండ జిల్లాలో ఓటర్ జాబితా సవరణ 2024-25 సంబంధించి ప్రణాళికాబద్ధంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఓటరు రూపకల్పన పై జిల్లాల కలెక్టర్ లకు వీడియో సమావేశం ద్వారా శిక్షణ అందించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ప్రావిణ్య పాల్గొన్నారు.