వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హన్మకొండలోని ప్రజా భవన్ లో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. రూ. 28కోట్ల నిధులతో పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణం కొరకు జీవో అందజేయడం పట్ల సీఎం రేవంత్ కి జిల్లా ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాడు నెహ్రూ ఆధ్వర్యంలో భవన నిర్మాణం మళ్ళీ నేడు రేవంత్ ఆధ్వర్యంలో అభివృద్ధి జరగడం అదృష్టం అన్నారు.