హన్మకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ లోని తెలంగాణ రాష్ట్ర మైనారిటీ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య శుక్రవారం సందర్శించారు. గురుకుల పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యతో పాటు ఏకరూప దుస్తులు, టెక్స్ట్, నోట్ బుక్స్ పంపిణీ గురించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అన్నారు.