హనుమకొండ హంటర్ రోడ్ లో బాల హనుమాన్ విగ్రహం శనివారం లభ్యం అయ్యింది. శివాలయ అభివృద్ధి పనుల్లో బాగంగా గుట్టను తొలగిస్తుండగా హనుమాన్ విగ్రహం బయటపడ్డది. బండరాళ్ల మధ్య బాల హనుమాన్ విగ్రహం ప్రత్యక్షం అవ్వడంతో
అక్కడే ప్రతిష్టించి పూజలను స్థానికులు నిర్వహిస్తున్నారు. తవ్వకాలలో బయటపడ్డ బాల హనుమాన్ విగ్రహానికి అక్కడే గుడి కడతామని స్థానికులు అంటున్నారు.