సమాజంలో బాలల నేరాల నివారణపై అవగాహనా సమావేశంను గురువారం అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. వరంగల్ ఆటోనగర్ లోని ప్రభుత్వ బాలుర పరిరక్షణ గృహం ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ నందిరాం నాయక్ మాట్లాడుతూ బాలలను నేరాలలోనికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడం అత్యంత ముఖ్యమని తెలిపారు. ప్రతి బాలుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు గౌరవం ఇవ్వాలని, చెడు స్నేహితుల అనుభందాలను దూరంగా ఉంచాలన్నారు.