హన్మకొండ: జర్నలిస్టుల రక్షణ చట్టం రూపొందించి అమలు చేయాలి
జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని రూపొందించి దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఎన్యూజే (ఐ) జాతీయ ఉపాధ్యక్షుడు పురుషోత్తం డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ జిల్లా జర్నలిస్టుల కమిటీ సమావేశం శుక్రవారం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కమిటీ అధ్యక్షుడిగా మోహన్, ప్రధాన కార్యదర్శిగా కుమారస్వామీ, కోశాధికారిగా సత్యంను ఎన్నుకున్నారు.