ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రత్యేక శ్రద్ధతో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుండి శాంతి కుమారి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి, రాష్ట్రస్థాయి ఉన్నత అధికారులతో కలిసి ధాన్యం కొనుగోలు, పత్తి పంట కొనుగోలు, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, గ్రూప్ 3 పరీక్షల నిర్వహణ అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.