పవిత్రమైన కార్తీక పౌర్ణమి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా నందికంది గ్రామంలోని రామలింగేశ్వరస్వామి దేవాలయంలో మహాశివుని సేవలో తరించారు. రామలింగేశ్వర స్వామికి పంచామృతాభిషేకం, భస్మాభిషేకం నిర్వహించారు. మహాశివునికి స్వహస్తాలతో హారతినిచ్చారు.