uidai.gov.in పోర్టల్‌కు వెళ్లి.. మై ఆధార్ ఆప్షన్‌లో కనిపించే ఆధార్ సర్వీసెస్ సెక్షన్‌లో ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అందులో OTPతో లాగిన్ కావాలి. అక్కడ కింద ఆథెంటికేషన్ హిస్టరీ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. అక్కడ ALLని ఎంచుకొని డేట్‌ని సెలెక్ట్ చేసుకుని FETCH AUTHENTICATION HISTORYపై నొక్కాలి. దీంతో మీ ఆధార్ కార్డును ఆరు నెలలుగా ఎక్కడెక్కడ వినియోగించారనే డేటా కనిపిస్తోంది.