మటన్ ముక్కల కోసం కొట్టుకున్న ఘటన యూపీలో చోటుచేసుకుంది. మీర్జాపూర్‌కు చెందిన బీజేపీ ఎంపీ వినోద్ బింద్ తన ఇంట్లో ఓ విందు కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా 1000 మందికి పైగా హాజరయ్యారు. అయితే హాజరైన వారందరికి మటన్ వేయకుండా.. కేవలం గ్రేవీని మాత్రమే వడ్డించారు. ఈ క్రమంలో వచ్చిన అతిథులు కాస్తా గొడవకు దిగారు. దాంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.