HYD: బేగంపేట్ కిమ్స్ సన్ షైన్ ఆస్పత్రిలో ఓ రోగికి పుష్ప సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ చేశారు. నిజామాబాద్‌కు చెందిన ప్రతీప్ (30)కు మెదడులో ట్యూమర్ ఉంది. ఈ ట్యూమర్ తొలగించడానికి వైద్యులు నావిగేషన్ గైడెడ్ అవేక్ క్రానియోటమి ద్వారా ఫంక్షనల్ న్యూరో సర్జరీ పద్ధతిలో రోగికి శస్త్రచికిత్స చేశారు. దీని కోసం రోగిని సర్జరీ సమయంలో మెలకువగా ఉంచేందుకు.. అతనికి ట్యాబ్‌లో సినిమాలు చూపిస్తూ ఆపరేషన్ చేశారు.