ఈవ్ టీజింగ్ చేసిన యువకుడిపై ఫిర్యాదు చేసినా. పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని బాలిక తరపున వారు ఆరోపించారు. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న బాలిక పట్ల పోచమ్మ మైదాన్ ప్రాంతంలో ఓ యువకుడు ఇటీవల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు మిల్స్ కాలనీ పోలీసులకు జరిగిన విషయాన్ని చెప్పారు. ఘటన జరిగిన పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేయాలని వారు సూచించారు.