అంధకారపు అణచివేత పొరలను చీలుస్తూ ఉదయించిన ఆదివాసీ వీరుడు కొమురం భీమ్ అని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మంగళవారం కొమురం భీమ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. ఆత్మగౌరవ పోరాటాలకు, అస్తిత్వ ఉద్యమాలకు కొమురం భీమ్ గొప్ప స్ఫూర్తినిచ్చాడని తెలిపారు. కొమురం భీం ఇచ్చిన జల్, జంగల్, జమీన్ నినాదమే తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉద్యమించేలా ప్రేరణ ఇచ్చింది అన్నారు.