అన్నదమ్ముల మధ్య స్థల వివాదం ఒకరి ప్రాణం తీసింది. దీంతో వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఎదుట శుక్రవారం మృతదేహంతో బాధితులు నిరసన తెలిపారు. శివనగర్ కు చెందిన పసునూటి రాజు 2008లో పట్టా పొందాడు. ఆ స్థలం తనదంటూ సోదరుడు సాంబయ్య పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో రాజును ఎస్సై సురేశ్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేపట్టాడు. రాజు బీపీ పెరిగి స్టేషన్ ఆవరణలో కిందపడిపోవడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.