కీటకజనిత వ్యాధులను నియంత్రించాలని వైద్య, ఆరో గ్యశాఖ అదనపు సంచాలకుడు అమర్సింగ్ నాయక్ అధికారులను ఆదేశించారు. శనివారం డీఎంహెచ్ వో వెంకటరమణ ఆధ్వర్యంలో మలేరియా, ఫైలేరియా నియంత్రణ కార్యక్రమాలపై ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నందున వైద్యాధికారులు నివారణ చర్యలను వేగవంతం చేయాలన్నారు. నీరు నిల్వ ప్రాంతాల్లో ఆయిల్బాల్స్ వేయాలని, సాయంత్రం వేళ ఫాగింగ్ చేయాలన్నారు.