హెల్మెట్లు ధరించి బైక్ పై వచ్చి చైన్ స్నాచింగ్

64பார்த்தது
హెల్మెట్లు ధరించి బైక్ పై వచ్చి చైన్ స్నాచింగ్
పట్టపగలు హెల్మెట్లు ధరించి బైక్పై వచ్చిన ఆగంతకుల్లో ఒకరు ఓ ఇంట్లోకి ప్రవేశించి, కత్తితో బెదిరించి మూడు తులాల గొలుసును లాక్కెళ్ళాడు. అనంతరం బైక్పై ఇద్దరూ పారిపోయారు. ఈ ఘటన చిలుపూర్ మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. రాధిక తన ఇంట్లో కూర్చుని టీవీ చూస్తోంది. ఈ లోగా ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి ఇంటి ముందు ఆగారు. ఒకరు ఇంట్లోకి వచ్చీరాగానే కత్తితో పొడిచి చంపుతానని మెడలో ఉన్న బంగారం ఎత్తుకెళ్లారు.

தொடர்புடைய செய்தி