మడికొండలో వరంగల్ అకాడమీ అఫ్ పిడియాట్రిక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియన్ అసోసియేషన్ అఫ్ పిడియాట్రిక్స్-తెలంగాణ 10వ వార్షిక సమావేశానికి ఆదివారం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య హాజరయ్యారు. రాష్ట్రంలోని చిన్న పిల్లల వైద్య నిపుణులు అందరూ ఒకే చోట కలిసే ఈ సమావేశానికి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. శిశువుల్లో అతి ప్రమాదకరమైన వ్యాధుల పట్ల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు.