సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రజ్యోతి క్రైమ్ రిపోర్టర్ నాయకపు సుభాష్ గుండె పోటుతో అకాల మరణం చెందండం అత్యంత బాధాకరమని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం బీమారంలో సుభాష్ సంతాప సభలో చిత్రపటానికి పూలమాలలు వేశారు. జర్నలిస్టు వృత్తికి న్యాయం చేస్తూ ప్రజల సమస్యల పట్ల అంకితభవంతో పనిచేసే గొప్ప వ్యక్తి సుభాష్ అని అన్నారు. 20 సంవత్సరాలుగా తనతో వ్యక్తిగతంగా కూడా ఎంతో సన్నిహితంగా ఉండేవారన్నారు.