వరంగల్ జిల్లాలో ఆదివారం రాత్రి బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆడపడుచులు పుట్టమన్ను తెచ్చి బొడ్డెమ్మను చేసి ఎర్రమన్నుతో అలికారు. చుట్టూరా ముగ్గులు వేసి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించారు. బొడ్డెమ్మ ముందు మట్టి ప్రమిద దీపం, అగరొత్తులు ముట్టించి యువ తులు, మహిళలు, చిన్నారులు లయబద్ధంగా పాటలు పాడారు. అనంతరం వెంట తెచ్చుకున్న అటుకులు, చక్కెరను అందరికీ ప్రసాదంగా పంచారు.