యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తుకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని గీసుగొండ ఎస్సై కుమార్ అన్నారు. సోమవారం గీసుగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు గంజాయి, డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. యువకులు తమ జీవితాలు బాగుపడాలన్నా. నాశనం కావాలన్నా ఇంటర్మీడియట్ దశ ఒక మలుపు అన్నారు. ఇంటర్‌లో బుద్ధిగా చదువుకొని చెడు అలవాట్లకు దూరంగా ఉంటే వారి జీవితం బాగుపడుతుందన్నారు.