ప్రభుత్వ పథకాల వర్తింపునకు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కోసం చేపట్టిన సర్వేను సమగ్ర వివరాలతో వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. పరకాల మున్సిపల్ పరిధిలోని రెండో వార్డులో పైలట్ ప్రాజెక్టుగా సర్వే కొనసాగుతుండగా కలెక్టర్ పరిశీలించారు. సర్వే వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఆధారంగానే ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు.