బీజేపీ వరంగల్ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వన్నాల వెంకట రమణ ఆద్వర్యంలో బీజేపీ సభ్యత్వ నమోదు కోసం మోర్చాల సంయుక్త సమావేశం శనివారం ఏర్పాటు చేశారు.
వన్నాల వెంకట రమణ మాట్లాడుతూ.
దేశ అభివృద్ధి కోసం బీజేపీ మరింత బలంగా తయారు కావాలని, అందుకై ప్రతీ కార్యకర్త ఒక్కొక్కరు 100కి పైగా సభ్యత్వాలు చేపించాలని, ప్రతీ మోర్చ ఆధ్వర్యంలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయాలన్నారు.