హరీష్ అనే ఖిల వరంగల్ కు చెందిన వ్యక్తి గొర్రెకుంట ప్రాంతంలో మట్కా నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో మంగళవారం వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. టాస్క్ ఫోర్స్ సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో రూ. 5 వేలు స్వాధీనం చేసుకుని నిర్వాకుడిని అదుపులోకీ తీసుకున్నారు. విచారణ నిమిత్తం గీసుగొండ పోలీసులకు అప్పగించడం జరిగిందని పోలీసులు తెలిపారు.