అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజాదరణ పెరిగిందని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. సంగెం మండలం పెద్దతండ గ్రామానికి చెందిన సుమారు 30 మంది టిఆర్ఎస్ కార్యకర్తలకు సోమవారం కండువా కప్పి వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.