పరకాల నియోజకవర్గ పరిధిలో యువతకు, మెగా టెక్స్ టైల్ పార్కు కోసం భూములిచ్చిన వారికి ఉపాధి కల్పించేందుకు అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో పరకాల నియోజకవర్గ పరిధిలో మెగా జాబ్ మేళా, టెక్స్ టైల్ పార్కులో సంగెం, గీసుకొండ తోపాటు ఇతర మండలాల స్థానికులకు ఉపాధి కల్పన, తదితర అంశాలపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.