రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రతి కార్యకర్త సమన్వయంతో కాంగ్రెస్ పార్టీని పటిష్టపరచాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. శనివారం పరకాల పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే అధ్యక్షతన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది.