పరకాల పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం నిర్వహించిన 7వ రాష్ట్రీయ పోషణ మాసం 2024 కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. నేటి సుపోషిత కిషోర బాలికలే-రేపటి శక్తివంతమైన మహిళలు అని అన్నారు. ఐసిడిఎస్ అంగన్వాడి సెంటర్ వారి ఆధ్వర్యంలో ఫుడ్ ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే పరిశీలించారు.