జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని మల్లంపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమి నుండి మంగళవారం దర్దపెల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న పెట్రోల్ బంకు కు మట్టిని తరలిస్తున్న 4 ట్రాక్టర్లు, 2 జెసిబిలను స్వాధీనం చేసుకొని తహసిల్దార్ కార్యాలయం తరలించారు.
ప్రభుత్వ భూమిలో మట్టిని తీయడం చట్టరీత్య నేరమని, అలాంటి వారిపై చర్యలు తప్పవని తహసిల్దార్ హెచ్చరించారు.