రైతులు అనేక వ్యయ ప్రయాసలు ఓర్చుకొని వరి పంటను పండించి మార్కెట్ కు తీసుకువచ్చి నెల రోజులు అవుతున్న నర్సంపేట వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం కొనుగోలు సెంటర్లో రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం లేదని సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేట వ్యవసాయ మార్కెట్ గేటు వద్ద రైతులతో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సీపీఐ ఎంఎల్ వరంగల్ జిల్లా నాయకులు కామ్రేడ్ మోడెం మల్లేశం హాజరయ్యారు.