నర్సంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు వ్యక్తులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఇటీవల పోలీసు వారి వాహన తనిఖీలో పట్టుబడ్డారు. వారిని మంగళవారం నర్సంపేట కోర్టులో హాజరుపరచగా నర్సంపేట సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కొత్త లక్ష్మీనారాయణ నలుగురికీ ఒక్కొక్కరికి ఐదు రోజుల జైలు శిక్ష, రూ.1000లు జరిమాన విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కొరకు ఆర్టీవోకు సిఫారస్సు చేస్తామన్నారు.