ములుగు జిల్లా ఏటూరునాగారంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకును కన్నాయి గూడెంకు తరలించాలని మండల ప్రజలు బ్యాంకు ఎదుట గురువారం ఆందోళన చేపట్టారు. గతంలో కన్నాయిగూడెంలో పంజాబ్ నేషనల్ బ్యాంకును ఏర్పాటు చేసి కొంతకాలం నిర్వహణ చేపట్టారని అన్నారు. అనివార్య కారణాలతో బ్యాంకును ఏటూరు నాగారంకు తరలించారని చెప్పారు. కాగా, కన్నాయిగూడెం నుండి బ్యాంకుకు రావాలంటే 40 కి. మీ దూరం ప్రయాణించాల్సి వస్తుందని వాపోయారు.