ములుగు జిల్లాలో మంత్రి సీతక్క ఎమ్మెల్యే స్టిక్కర్ ఫోర్జరీ చేసి తిరుగుతున్న కారుపై విచారణ జరపాలని మంగళవారం పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే స్టిక్కర్ తో తిరుగుతున్న కారులో బీజేపీ కండువాతో తిరుగుతున్నట్టు గుర్తించారు. ఎమ్మెల్యే స్టిక్కర్ తో తిరుగుతున్న కారు దాసరి రవి కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.