రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి రేపు శుక్రవారం ములుగు జిల్లాకు రానున్నారు. కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల, సమ్మక్కసాగరం ప్రాజెక్టులు సందర్శిస్తారు. హెలీకాప్టర్ లో ఉదయం 9 గంటలకు ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం దేవాదుల ఎత్తిపోతల పథకం పంపింగ్ స్టేషన్ వద్దకు చేరుకొని పంప్‌హౌస్‌ను పరిశీలించి అధికారులతో సమీక్షిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లాకు వెళ్తారు. మంత్రి పర్యటన నిమిత్తం బుధవారం జిల్లా కలెక్టర్ పంప్ హౌస్ వద్ద పరిస్థితులను సమీక్షించారు.