కొత్తగూడ మండలంలో విద్యుత్ షాక్ తో హెల్పర్‌ కు గాయాలు

69பார்த்தது
కొత్తగూడ మండలంలో విద్యుత్ షాక్ తో హెల్పర్‌ కు గాయాలు
ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలంలో విద్యుత్ సిబ్బంది ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. కొత్తగూడ మండలం ఓటాయి గ్రామంలో విద్యుత్ హెల్పర్ గా పనిచేస్తున్న రవి ఎదుళ్లపల్లిలో 11కెవి విద్యుత్ లైన్ మరమ్మతులు చేస్తున్నాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కొట్టింది. చేతులకు, కాళ్లకు తీవ్ర గాయాలవ్వడంతో ఆయనను వరంగల్ కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி