ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ లో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10. 30 గంటల నుంచి గ్రీవెన్స్ లో ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అధికారులు సకాలంలో గ్రీవెన్స్ కు హాజరుకావాలని ఆదేశించారు.