ములుగు జిల్లా ఏటూరునాగారం మేజర్ గ్రామ పంచాయతీ కార్మికులు 5 నెలలుగా జీతాలు చెల్లించడం లేదంటూ మంగళవారం విధులు బహిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో మండల కేంద్రంలో చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ పేరుకుపోయింది. షాపుల ముందు, ప్రధాన కూడళ్ల వద్ద దుర్వాసన వెదజల్లుతుందని బుధవారం స్థానికులు వాపోతున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని వెంటనే జిపి సిబ్బందికి జీతాలు చెల్లించి, చెత్తను తొలగించాలని కోరుతున్నారు.