ఉపాధ్యాయ పోస్టులకు అర్హత పొందిన అభ్యర్థులు ఈనెల 5వ తేదీలోగా ధృవీకరణ పత్రాలను సమర్పించాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర కోరారు. జిల్లాలో 192 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి డీఎస్సీ పరీక్షల ద్వారా 576 మంది అర్హత పొందారని తెలిపారు. వీరిలో 1: 3 ప్రకారం పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అర్హత పొందిన వారికి త్వరలోనే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తామని తెలిపారు